సాధారణంగా ప్రేమికులు ఎవరి కంటా పడకుండా రొమాన్స్ సాగిస్తుంటారు. కానీ, ఈ ప్రేమ జంట అందుకు విభిన్నం. అందరూ చూస్తుండగా, పట్టపగలు నడిరోడ్డుపైనే చెలరేగిపోయారు. నలుగురు చూస్తున్నారనే విషయాన్ని కూడా మరిచి బైక్‌పై వెళ్తూనే పనిలో నిమగ్నమయ్యారు. బైక్‌పై రైడ్ చేస్తుండగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై హంగామా చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వీరి హల్‌చల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని ప్రియుడి రెచ్చిపోయాడు. ఈ ప్రేమ పక్షులు తాము రోడ్డుపై ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి.. ఎదురుగా వచ్చే వాహనాలేవీ తమకేవీ అడ్డుకావన్నట్టుగా నడిరోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. పైగా అబ్బాయికి హెల్మెట్ లేదు. అందులోనూ అమ్మాయి కాలేజీ యూనిఫామ్‌లో ఉంది.ఆ భయం కూడా ఆమెలో కనిపించలేదు. అక్కడితో ఆగారా! అంటే లేదు.. యువతి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకా చెప్పలేని పనులు చేసింది. వారి వెనుక వెళ్తున్న వారు ఇదేం పని ప్రశ్నించినా.. వారు ఏమాత్రం వినిపించుకోకుండా.. వారి పని వారు కానిచ్చారు. వీరి వెనకాలే వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో కాస్తా వైరల్‌గా మారింది.