సేవా కార్యక్రమాలు చేయడంలో మంత్రి ఆర్కే రోజా ఓ అడుగు మందే ఉంటారు. ఇప్పటికే ఓ బాలికను దత్తత తీసుకుని చదివిస్తోన్న సంగతి తెలిసిందే. తన రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. తాజాగా మరో కార్యక్రామాన్ని ప్రారంభించారు రోజా. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. ప్రత్యర్థుల మీద ఆమె చేసే విమర్శలు అంత పదునుగా ఉంటాయి. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రోజా. ప్రస్తుతం ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా రోజా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి.. ఎందరికో సాయం చేస్తున్నారు. ఓ పేద విద్యార్థిని దత్తత తీసుకుని చదివిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రోజా చేస్తున్న మరో మంచి పని వెలుగులోకి వచ్చింది. దాని గురించి తెలుసుకున్న వారు రోజా చేస్తున్న పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సాధారణంగా గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మంచి పౌష్టికాహారం అందించాలి. అయితే పేద మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలకు పౌష్టికాహారం లభించడం కష్టం. ఈ విషయం అర్థం చేసుకున్న మంత్రి రోజా వారి కోసం ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరి నియోజకవర్గంలో గర్భిణీ మహిళలు, బాలింతల కోసం.. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు రోజా. ‘‘అమ్మల కోసం అమ్మ ప్రేమగా..!!’’ అనే కార్యక్రమం ద్వారా నగరి ప్రభుత్వాసుపత్రిలో ప్రతి బుధవారం గర్భిణీ మహిళలు, బాలింతలకు ఉచితంగా మంచి పౌష్టికాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు రోజా.
దీని గురించి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు రోజా. అమ్మల కోసం అమ్మ ప్రేమగా కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది.. కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న ఈ భోజన వితరణ కార్యక్రమంలో కడుపు నిండా భోజనం చేసిన నిండు గర్భిణీలు, తల్లులు కడుపారా దీవించి వెళ్తుంటే.. లభించే సంతోషం.. ఇంకెక్కడా దొరకదు’’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. రోజా చేస్తున్న మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. మరి రోజా ప్రారంభించిన ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.