మాములుగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం అనేది సహజం. కానీ వైజాగ్ లో మాత్రం ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మయిలు నడిరోడ్డుపై జుట్లు పట్టి కొట్టుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం 8 గంటల సమయం. విశాఖ ఆర్టీసీ బస్టాండులో కాలేజీలకు వెళ్తున్న యువత, ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అంతలోనే ఓ ఇద్దరు యువతుల మధ్య మాటా మాటా పెరిగింది. వీరిద్దరి మధ్యలో ఓ యువకుడు నిలబడ్డాడు. మెల్లగా ఆ యువతుల మధ్య బూతు పురాణం కూడా రాజుకుంది. ఏం జరుగుతుందో చూద్దామనుకునేలోపే ఇద్దరు యువతులు జుట్లు పట్టుకుని గుద్దుకోవడం మొదలు పెట్టారు. ప్రేమ వ్యవహారం కారణంగానే వీరిద్దరు కొట్టుకుంటున్నట్లు అక్కడున్న వారంత గమనించారు. కానీ ఇద్దరు యువతులను మెయింటెన్ చేస్తున్న ప్రియుడి బండారం చివరికి బట్టబయలైంది.
ఇక ఇద్దరు యువతులు కొట్టుకుంటున్న విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏంటని ఇద్దరి యువతులను పోలీసులు ప్రశ్నించగా ప్రియుడి కోసం తన్నుకున్నట్లు తెలిసింది. ఇక స్టేషన్ తీసుకొచ్చి ప్రియుడితో పాటు ప్రియురాళ్లకి పోలీసులు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. అలా ఆ ఇద్దరు కొట్టుకుంటున్న దృశ్యాన్ని అక్కడున్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఒక ప్రియుడు కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డుపై గద్దుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు ప్రియురాళ్ల ముద్దుల ప్రియుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Uppula Naresh (@UppulaNaresh72) December 22, 2021