తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే విధంగా తిరుమలలో లభించే స్వామి వారి ప్రసాదం ఎంతో ప్రత్యేతను కలిగి ఉంది. స్వామి ప్రసాదం కోసం భక్తులు ఎగబడుతుంటారు. ఇదే సమయంలో టీటీడీ సైతం భక్తులు స్వామి వారి ప్రసాదం భక్తులకు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అలానే లడ్డు తయారీని వేగవంతం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంది. తాజాగా తిరుమల లడ్డును విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల లడ్డూల తయారీ మరింత వేగంగా మారనుంది. శ్రీవారి లడ్డులను మరింత వేగంగా తయారు చేసేందుకు హైటెక్ యంత్రాలను వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉన్న సంగతి అందరికి తెలిసిందే. తిరుమల లడ్డుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా ఎన్నో ఆలయాల ప్రసాదాలు ఉన్నా.. తిరుమల లడ్డుకి ఎంతో ఆదరణ ఉంది. ఇంత విశిష్టత కలిగిన లడ్డు తయారీ విషయంలో టీటీడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తిరుమలలో నిత్యం లక్షకు పైగా లడ్ల వితరణ అవుతాయి. అయితే ఈ స్థాయిలో లడ్డూలను అందిస్తున్న టీటీడీ, నాణ్యత విషయంలో ఎక్కడ లేకుండా అందిస్తోంది. అలానే రోజు రోజుకు తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిపోతుంది.
ఈక్రమంలో భక్తులకు లడ్డు ప్రసాదాన్ని అందిచడం కోసం టీటీడీ అత్యాధునికి సాంకేతికతో కూడిన యంత్రాలను వినియోగించాలని నిర్ణయించింది. తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం హైటెక్ పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 50 కోట్లతో ఈ యంత్రాలను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. జనవరిలో 20.78 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని, హుండీ కానుకల ద్వారా రూ. 123.07 కోట్లు రాగా, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1.07 కోట్ల ఆదాయం వచ్చిందని ధర్మారెడ్డి తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ‘టీటీడీ దేవస్థానం’ పేరుతో మొబైల్ యాప్ ను ప్రారంభించినట్లు ధర్మారెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదాల తయారీ గురించి పై విధంగా ధర్మారెడ్డి ప్రస్తావించారు. మరి.. తిరుమల లడ్డు తయారీని వేగవంతం చేయడంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.