‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’అని సామెత. అంటే అవి అంత బాగుంటాయి మరీ. అలాగే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా.. ఆ దేవుణ్ణి/దేవతను స్మరించుకున్నాక, ప్రసాదాలను కచ్చితంగా తీసుకుంటాం.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే భక్తులకు సంతోషాన్ని కలిగించే ఓ నిర్ణయం టీటీడీ తీసుకుంది.
తిరుమల గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాద వితరణలో టీటీడీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ లడ్డూకు వచ్చే రుచి మరెక్కడా రాదని భక్తులు అంటుంటారు. అంతటి ఘనమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే..!
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే విధంగా తిరుమలలో లభించే స్వామి వారి ప్రసాదం ఎంతో ప్రత్యేతను కలిగి ఉంది. స్వామి ప్రసాదం కోసం భక్తులు ఎగబడుతుంటారు. ఇదే సమయంలో టీటీడీ సైతం భక్తులు స్వామి వారి ప్రసాదం భక్తులకు అందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అలానే లడ్డు తయారీని వేగవంతం […]