వారిది ఓ అందమైన కుటుంబం. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న ఆ యువతికి చిన్నప్పటి నుంచి జీవితంపై ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. జీవితంలో గొప్పగా స్థిరపడాలని ఎంతో ఆశపడింది. కానీ ఆమె ఆశలు తండ్రి మరణంతో నిరాశగానే మిగిలిపోయాయి. గతంలో తండ్రి మరణించడంతో యువతి తల్లికి తోడు నీడగా ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. ఇక తన తల్లిని బాగా చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఆ యువతి ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు.
అది తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెం. ఇదే గ్రామంలో గెడ రాజు, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహ జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు శ్రీవల్లి సాహితి (22) కూతురు జన్మించింది. అయితే ఈ దంపతులకు ఒక్కగానొక్క కూతురు కావడంతో తల్లిదండ్రులు ప్రాణంగా చూసుకుంటూ బాగా చదివించారు. ఇదిలా ఉంటే.., గత 8 ఏళ్ల కిందట గెడ రాజు అనారోగ్యంతో బాధపడుతుండడంతో భార్య నారాయణమ్మ అనేక ఆస్పత్రుల చుట్టు తిప్పింది. అయినా ఫలితం లేకపోవడంతో రాజు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచాడు.
భర్త మరణించడంతో నారాయణమ్మ ఉన్న ఒక్కగానొక్క కూతురుని చదివించుకుంటూ కాలాన్ని వెల్లదీసింది. అలా కొంత కాలానికి డిగ్రీ పూర్తి చేసిన శ్రీవల్లి సాహితి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరింది. దీంతో వచ్చిన జీతంతో ఆ యువతి తల్లిని చూసుకుంటూ ఉంది. అయితే ఈ క్రమంలోనే శ్రీవల్లి గత 5 రోజుల కిందట తీవ్ర జ్వరంతో బాధపడింది. గమనించిన తల్లి వెంటనే స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అయినా శ్రీవల్లి ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. అలా నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన శ్రీవల్లి గురువారం ప్రాణాలు కోల్పోయింది. తోడు, నిడగా ఉన్న ఒక్కగానొక్క కూతురు కూడా ప్రాణాలతో లేకుండా పోవడంతో నారాయణమ్మ తీవ్రంగా రోధించిన తీరు స్థానికుల కంట కన్నీరు తెప్పించింది. గతంలో తండ్రి, ఇప్పుడు కూతురు మరణించడంతో ఆ మహిళ ఇప్పుడు అనాధగా మారింది. తాజాగా చోటు చేసుసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.