నేటికాలంలో మనిషిలో మానత్వం అనేది కనుమరుగవుతుంది. ప్రమాదంలో ఉన్న వ్యక్తి సాయం చేయకుండా తమదారిని తాము వెళ్తుంటారు. ఇలా మానవత్వం మంటగలిసి పోతుందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
నేటి సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. సాటి వ్యక్తి చావుబతుకుల మధ్య పోరాడుతున్నా తమకు సంబంధం లేదు అన్నట్లూ చూస్తూ వెళ్తుంటారు. ఇటీవలే హైదరబాద్ నగరంలో ఓ వ్యక్తిని నలుగురు కలిసి పట్టపగలు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఆ దారుణ ఘటన జరుగుతున్న సమయంలో వందలాది వాహనాలు అటుగా వెళ్తున్నాయి. ఎవరు కాపాడే ప్రయత్నం చేయలేదు. అలానే ఆదివారం నంద్యాల జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఓ దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎవరు సాయం చేయకు ఆ మహిళ మృతి చెందింది. తాజాగా అలాంటి ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ కు వెళ్లే దారిలో ఆదివారం ఉదయం ఓ అనాథ వ్యక్తి మరణించాడు. అలా ఉదయం చనిపోయిన వ్యక్తిని మధ్యాహ్నం 12 గంటలు అవుతున్న రోడ్డుపై నుంచి ఎవరు తీయలేదు. ఉదయం చనిపోయిన వ్యక్తిని మధ్యాహ్నం వరకు ఆ దారిలో వెళ్తున్న వందలాది మంది చూస్తున్నారేగాని అతని గురించి ఎవరు పట్టించుకోలేదు. కనీసం అక్కడ ఓ మృతదేహం ఉందనే సమాచారం ఇచ్చి అంత్యక్రియలకు సహకరిద్దామన్న విషయమే మరిచారు. చివరకు 12 గంటల తరువాత విషయం తెలుసుకున్న స్థానిక సీఐ శేషయ్య ద్రోణాచల సేవా సమితికి తెలియజేశాడు. సమాచారం అందుకున్న సేవాసమితి వారు ఒంటి గంట తరువాత అక్కడి చేరుకుని.. ఆ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలా మానవత్వం మంటగలిసిపోతున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.