Tirupati Woman: బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కుటుంబాన్ని వదిలి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారిపై రాబంధుల కన్నుపడుతోంది. తమ కోర్కెలు తీర్చాలంటూ కొంతమంది వ్యక్తులు వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒప్పుకోకపోతే నానా కష్టాలు పెడుతున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బతుకు తెరువుకోసం గల్ఫ్ వెళ్లిన ఓ మహిళపై ఏజెంట్ వేధింపులకు పాల్పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పెద్ద వడ్డెపల్లికి చెందిన శ్రావణి బతుకు తెరువుకోసం గత నెల కువైట్ వెళ్లింది. ఏజెంట్ చంగల్ రాజా ఆమెను ఓ గదిలో బంధించి కోర్కెలు తీర్చాలంటూ వేధింపులకు దిగాడు.
ఈ నేపథ్యంలో ఆమె ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను చిత్రీకరించింది. దాన్ని కుటుంబసభ్యులకు పంపంది. నాలుగు రోజులు తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యింది. తనను ఎలాగైనా ఇండియాకు తీసుకెళ్లాలని వేడుకుంది. మేకల పల్లికి చెందిన చంగల్ రాజా, మదనపల్లికి చెందిన బాబాజి అనే ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anantapur: భర్త బతికి ఉండగానే వైధవ్యం.. వరుస చావులతో అరిష్టమని వణికిపోతున్న గ్రామస్థులు!