రాయలసీమ వాసులకు శుభవార్త అందుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మరో ముందడుగు వేసింది రాష్ర ప్రభుత్వం. ఏంటా శుభవార్త అనుకుంటున్నారా..! అయితే కింద చదివేయండి.
సినిమాల ప్రభావం వల్ల రాయలసీమ అంటే.. కొట్టుకుచావడం అన్నది అందరిలో ఉన్న భావన. ఇంకా మాట్లాడితే.. అక్కడ ఏ రకమైన అబివృద్ది ఉండదు.. అదొక కరువు ప్రాంతం.. ఆ ఊరి గురుంచి మాట్లాడకు అంటారు. ఎందరో రాయలసీమవాసులు మంచి చదువులు అభ్యసించి.. ఉన్నత ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడ్డ.. ఈ మాటలు మాత్రం ఆగడటం లేదు. అందుకు ప్రధాన కారణం.. సరైన అభివృద్ధి లేకపోవటం. ఒకేవేళ ఉన్నా అవి పూర్థిస్థాయికి నోచుకోకపోవటం. వీటన్నింటికి పరిష్కారం చూపే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే పనులకు శ్రీకారం చుట్టింది.
చెప్పుకోవడానికి కడప, తిరుపతిలో ఎయిర్ పోర్టులు ఉన్నా వాటి నుంచి ప్రయాణం సాగించే విమాన సర్వీసుల సంఖ్య చాలా తక్కువ. అందులో ఈ విమాన సర్వీసులన్నీ స్వదేశంలోనే. ఒకవేళ విదేశాలకు వెళ్లాలంటే రాయలసీమ ప్రజలందరూ చెన్నై.. బెంగుళూరు.. హైదరాబాద్ అంటూ ఇలా ఏదో ఒక దారి చూకోవాల్సిందే. ఇకపై ఆ కష్టాలు తీరనున్నాయి. తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ముందుగా కువైట్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, తిరుపతి ఎంపీ గురమూర్తి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖతో పాటు విమానయాన సంస్థలతోనూ సంప్రదింపులు జరపుతున్నారు.
ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్‌కు విమాన సర్వీసులు ప్రారంభించాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. అందుకుగాను రూ. 400 సీట్లు కేటాయించాలని కోరగా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. తిరుపతి నుంచి కువైట్‌కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్ వెల్లడించారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ సర్వీసులు నడపడానికి వీలుగా ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్, కస్టమ్స్‌కు అవసరమైన సౌకర్యాలతో పాటు విదేశీ ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు, కన్వేయర్ బెల్ట్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
కాగా, తిరుపతి విమానాశ్రయానికి 2017లో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అంతర్జాతీయ సర్వీసులు టేకాఫ్ కాలేదు. దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం నగరం నుంచి ప్రపంచం నలుమూలలకు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే చిత్తూరు, రాజంపేట, రాయచోటి, నెల్లూరు ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే రాయలసీమ ప్రజల కష్టాలు కొంతమేర తీరినట్లే. ఇతర నగరాలకు వెళ్ళడానికి వెచ్చించే అదనపు ఖర్చు లేకుండా నేరుగా విదేశీ ప్రయాణం చేయవచ్చు. అలాగే, విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా ప్రయాణం సులభతరమవుతుంది. చూడాలి మరి ఎప్పటివరకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయో.. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.