నిండు నూరేళ్లు కలిసి ఉంటామని మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన జంటలు ఏడాది తిరగకుండానే ఎన్నో కారణాల వల్ల కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, వివాహేతర సంబంధాలు కారణంగా ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
వివాహం అనేది ఓ పవిత్రమైన బంధం. వేదమంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో జీవితాంతం కలిసి ఉంటామని వివాహబంధంతో ఒక్కటైన దంపతులు.. ఏడాది తిరగకుండానే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వివాహేతర సంబంధాలు, దంపతుల మధ్య అనుమానాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల విడిపోతున్నారు. ఇలాంటి వ్యవహారలు కొన్నిసార్లు హత్యలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకొని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వివాహబంధంతో ఒక్కటై.. కడదాకా తోడుండాల్సిన భర్తే.. ఆమె పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకొని విచక్షణ కోల్పోయాడు.. ఆమెతో తరుచూ గొడవపడుతూ చిత్రం హింసలకు గురి చేస్తూ వచ్చాడు. చివరికి భార్యను అత్యంత పాశవికంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజి దావీదు, నిర్మల భార్యాభర్తలు. ఈ దంపతులకు పదేళ్ల లోపు ఉన్న ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మద్య తరుచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో భార్య నిర్మల తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాది కోసం కువైట్ కి వెళ్లింది. మరోవైపు దావీదు మద్యానికి బానిసగా మారిపోయాడు.
మద్యానికి బానిసై ఏ పనులు చేయకుండా ఇంటివద్ద ఉంటున్న దావీదు తనకు భార్య డబ్బు పంపించడం లేదన్న కోపంతో ఇద్దరు కూతుళ్లను చిత్ర హింసలు పెట్టేవాడు. తాను ఇద్దరు కూతుళ్లను హింసిస్తున్న దృశ్యాలను కొడుకుతో వీడియో తీయించి భార్యకు పంపించేవాడు. ఇటీవల ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దావీదుని తాడేపల్లి గూడెం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈలోగా భార్య నిర్మల కువైట్ నుంచి వచ్చి తన పిల్లలతో పుట్టింటో ఉంటుంది. రెండు నెలల క్రితం దావీదు జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. నిర్మల తల్లిగారింటికి వచ్చి తాను పూర్తిగా మారిపోయాను.. కలిసి ఉందాం అంటూ భార్యాపిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లాడు.
దావీదు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకొని మళ్లీ గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. గురువారం రాత్రి నుంచి భార్యాభర్తల మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. సైకోగా మారిన దావీదు.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిర్మల మెడ, చేయి.. తలను రెండు ముక్కలుగా చేసి అత్యంత పాశవికంగా నరికి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని దావీదుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ బండారు శ్రీనాథ్ తెలిపారు.