బ్రతుకు దెరువు కోసం కరువు జిల్లా కడపనుంచి ఎడారి దేశం కువైట్‌కు పోయిన ఆ దంపతుల జీవితం అనుకోని ఘటనతో తల్లకిందులైంది. యజమాని కుటుంబం హత్య కేసులో ఉరుక్కున్న ఆ ఇద్దరు జైలు పాలయ్యారు. సహాయం చేసే వారు లేక, బయటపడేదారి దొరక్క నాలుగు గోడల మధ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్తకు ఉరి శిక్ష పడింది. భార్యను ఇండియా పంపేశారు. తన భర్తను కావాలనే హత్య కేసులో ఉరికించారని అంటూ ఆ భార్య ఆవేధన వ్యక్తం చేస్తోంది. కువైట్ సేఠ్ కుటుంబం దారుణ హత్య కేసులో ఉరి శిక్ష పడ్డ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పా గ్రామ వాసి వెంకటేష్ భార్య స్వాతి శుక్రవారం స్వగ్రామం చేరుకున్నారు.
ఈ సందర్భంగా స్వాతి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను, నా భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లాము. అక్కడ ఓ సేఠ్ వద్ద నా భర్త డ్రైవర్‌గా పనికి కుదిరాడు. అంతా బాగా ఉందనుకుంటున్న సమయంలో వెంకటేష్ పని చేసే సేఠ్‌ను ఆయన భార్య, కుమార్తెను ఎవరో హత్య చేశారు. సేఠ్ వద్ద పని చేస్తున్నాడన్న ఒకే ఒక్క కారణంతో ఈ హత్య కేసులో నన్ను, నా భర్తను అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టారు. తర్వాత నన్ను జైలు నుంచి వదిలేసి ఇంటికి వెళ్లిపొమ్మని అన్నారు. బతుకు దెరువు కోసం కువైట్ వెళ్లాము. అలాంటి మాకు హత్యలు చేయాల్సిన అవసరం ఏంటి?.. ఎవరో చేసిన నేరాన్ని నా భర్తపై మోపి శిక్ష విధించటం ఎంత వరకు న్యాయం. ఒక వేళ నా భర్త ఈ హత్య చేసి ఉంటే నన్ను కువైట్‌నుంచి విమానంలో ఇక్కడికి ఎందుకు పంపుతారు. నా భర్తను కాపాడండి’’ అంటూ గుండెలవిసేలా ఏడ్చిందామె. స్వాతి ఆవేధనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. ఆమె వద్దన్నా వినలేదు.. చివరకు..
యాక్సిడెంట్ లో భర్త మృతి! పోలీసులు కూడా ఊహించని ట్విస్ట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.