దేశంలోని ఆలయాల్లో.. అత్యధిక ఆదాయం వచ్చే గుడి ఏది అంటే టక్కున వినిపించే సమాధానం.. తిరుమల తిరుపతి దేవస్థానం. అవును.. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దేవుడు తమ కోర్కెలు తీర్చినందుకు కృతజ్ఞతగా.. తమకు చేతనైనంత మొత్తాన్ని హుండీలో సమర్పించి వెళ్తారు. ఈ నేపథ్యంలో తిరుమల హుండీ ఆదాయం.. రోజుకు కోట్లలో ఉంటుంది. ఈ క్రమంలో తిరుపతి దేవస్థానం.. నయా రికార్డుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. తిరుమల హుండీ ఆదాయంతో ఈ రికార్డు నెలకొల్పింది. ఇక 2023 కొత్త ఏడాది ప్రాంరభమైన మరుసటి రోజే..హిందువులు ఎంతో పవిత్రంగా భావించే.. వైకుంఠ ఏకాదశి పండుగ వచ్చింది. ఇక నవరాత్రలు సమయంలో తిరుమల ఎంత రద్దీగా ఉంటుందో.. వైకుంఠ ఏకాదశి వేళ.. అంతకన్నా ఎక్కువ రద్దీ ఉంటుంది తిరుపతిలో.
నూతన సంవత్సరం సందర్భంగా.. చాలా మంది భక్తులు.. ఏడుకొండల స్వామివారి దివ్య ఆశీస్సులతో.. ఆయన నివాసముంటున్న తిరుమల పరిసరాల్లో.. కొత్త ఏడాదిని ప్రారంభించాలనుకున్నారు. దాంతో.. డిసెంబర్ 31 నుంచే తిరుమలకు క్యూకట్టడంతో తిరుమలలో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. ఇక కొత్త సంవత్సరం, ఆ మరుసటి రోజే.. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తిరుపతి తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే అత్యధికంగా హుండీ ఆదాయం.. ఏకంగా రూ.7.6 కోట్లు వచ్చింది. అంతకుముందు 2022 అక్టోబర్ 23న గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఒకే రోజు రూ.6.3 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. 2023 నూతన సంవత్సరం తొలి రోజే ఆ రికార్డు బ్రేక్ చేసి ఏకంగా 7.68 కోట్ల ఆదాయం వచ్చింది. దాంతో.. జనవరి 2, వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పటివరకు తిరుమల చరిత్రిలోనే అత్యధికంగా రూ.7.6 కోట్ల హుండీ సేకరణను నమోదయ్యింది. కరోనా కారణంగా.. గత రెండేళ్లలో తిరుమల హుండీ ఆదాయం తగ్గింది. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయడంతో.. తిరుమలలో మళ్లీ పూర్వ పరిస్థితులు కనిపిస్తున్నాయి