ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగు అకాడమీ విభజనకు విషయంలో తెలంగాణ రాష్ట్రాలనికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గత కొంత కాలంగా తెలుగు అకాడమీ విభజన విషయంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసును జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన నేపథ్యంలో తెలుగు అకాడమీ విభజనపై పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ విభజన విషయంలో పెద్ద రగడ కొనసాగుతూ వస్తుంది. అయితే విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు, సిబ్బందిని 42:58 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి చెల్లించాల్సిన రూ. 92.94 కోట్లు కొంత కాలంగా పెండింగ్ పడుతూ వచ్చాయి. ఈ సొమ్మును ఒక్క వారంలోపు ఇచ్చివేయాలని తీర్పు ఇచ్చింది. అంతేకాదు దీనికి ఆరు శాతం వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు రాష్ట్రాల విషయంలో ఇలాంటి సమస్యలు తలెత్తితే.. నిధుల పంపకాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.