ఈ విశాల విశ్వంలో కేవలం ఈ భూమ్మీద మాత్రమే జీవం ఉందా.. మిగతా గ్రహాల మీద.. వేరే చోట ఎక్కడైనా జీవులు మనగలుగుతున్నాయా అంటే సరైన సమాధానం లేదు. విశ్వంలో జీవం ఆనవాళ్ల గురించి తెలుసుకునేందుకు.. ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ సమాధానం లభించలేదు. కాకపోతే.. అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని వింతలు కనిపిస్తుంటాయి. చాలా మంది తమకు ఫ్లైయింగ్ సాసర్స్ వంటివి కనిపించాయని చెబుతుంటారు. అప్పుడప్పుడు ఏలియన్స్ అంటూ కొన్ని వింత ఆకారాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇది చూసిన జనాలు.. గ్రహాంతరవాసులు, ఫ్లైయింగ్ సాసర్లు, గ్రహాల సముదాయం అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
ఏపీలో ఆకాశంలో వింత వెలుగులు కనిపించాయి. దీనికి సంబంధించి.. ఫ్లయింగ్ సాసర్స్, ఏలియన్స్ కనిపించాయి అంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరలువుతన్నాయి. ఈ వింత సంఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. కదిరి పట్టణంలో ఆకాశంలో.. వింత వెలుగులు కనిపించాయి. మిణుగురు పురుగుల తరహాలో.. ఒకదాని వెంట ఒకటి.. వరుసగా మిణుకుమిణుకుమంటూ బారుగా ఉన్న వింత ఆకారం ఒకటి కనిపించింది. 20 సెకన్ల తర్వాత ఆ దృశ్యం మాయమయ్యింది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్రహాంతరవాసులని కొందరు కామెంట్ చేస్తే.. కాదు.. ఫ్లయింగ్ సాసర్‌లు అంటూ మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా అంతసేపు కాంతివంతంగా కనిపించి.. వెంటనే మాయమైంది అంటే.. అది ఏదో మార్మికమైనదే.. మనకు తెలియనదే అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నిజంగానే గ్రహాంతరవాసులు ఉన్నాయంటారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.