గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది. స్పైస్ జెట్ విమానాలకు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవటంతో సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆన్లైన్ బుకింగ్ లను కూడా స్పైస్ జెట్ సంస్ధ నిలిపివేసింది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా విమానాశ్రయం నుంచి స్పైస్‌జెట్ సర్వీసులు నిలిచిపోయాయి.
గన్నవరం నుంచి ఎయిరిండియా, ఇండిగో, ట్రూజెట్ విమానాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మరోక రెండు నెలలు వేచి చూసి విమానాలు నడిపేది, లేనిది నవంబర్ లో ప్రకటిస్తామని సంస్ధ తెలిపింది. గన్నవరం నుంచి బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో గన్నవరం విమానాశ్రయం బోసి పోయింది.