కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపార రంగాలు చితికిల పడ్డాయి. ఇక మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉదృతిలో ఎక్కువ మొత్తలో నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు కరోనా మెల్ల మెల్లగా క్షిణిస్తుండటంతో దేశ వ్యాప్తంగా రాష్ట్రాలన్ని అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక వ్యాపారాలు దెబ్బ తినటంతో పాటు విద్యా సంస్థలు కూడా మూతపడ్డాయి. ఇక దీంతో పాటు సెకండ్ వేవ్ పూర్తి కాకముందే థర్డ్ వేవ్ అంటూ కరోనా మళ్ళీ దూసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కేసులు కూడా నమోదవుతుండటం అందరిని భయాందోళనలకు గురి చేస్తోంది.
ఇక ఏదేమైనా విద్యార్థుల భవిష్యత్తును అంచనా వేస్తూ పాఠశాలలు తెరవాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. నేడు జరిగిన అధికారుల సమక్షంలో విద్యాసంస్థలను ఓపెన్ చేయాలంటూ నిర్ణయం తీసుకుంది.
ఇక వచ్చే నెల 16 నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని కూడా తెలిపారు సీఎం జగన్. దీంతో పాటు విద్యా కానుక కిట్లు కూడా అందజేస్తామని తెలిపారు. ఏపీలో కరోనా కేసులు క్రమ క్రమంగా క్షిణిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తేలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నా…విపక్షాలు మాత్రం సర్కారుపై మండి పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలోని ప్రతిపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వేళ్ళు వెత్తుతున్నాయి.
గతంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేశారు. ఇక తెలంగాణాలో కూడా విద్యా సంస్థలను ప్రారంభించాలా? వద్దా? అనే దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక ఏపీలో పాఠశాలలు తెరవటం ఎంత వరకు కరెక్ట్ అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.