సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారు.. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు చేరుకుంటారు. విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇక సంక్రాంతి మూడు రోజుల పండుగ కనుక.. ఆ మూడు రోజులు ఎలాగు సెలవు వుంటుంది. ఇక పండుగకు ముందు.. తర్వాత రోజులు కూడా సెలవురు ఇస్తారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలు.. సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. ఏపీ అత్యధికంగా ఏడు రోజులు సెలవులు ప్రకటించగా.. తెలంగాణలో మాత్రం 5 రోజులే సంక్రాంతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
ఏపీలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 19న పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే ముందు ఏపీ ప్రభుత్వం.. 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఉపాధ్యాయ సంఘాల వినతితో.. అదనంగా ఒక రోజు సెలవు పొడగింపు ఇస్తున్నట్లు.. ఏపీ విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు.
ఇక తెలంగాణ విషయానికి.. వస్తే జనవరి 13-17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజులు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. 18వ తేదీన కాలేజీలు, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.