నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడమే కాదు ఒక కుటుంబం రోడ్డున పడుతుంది. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపటం వంటివి ఈ ప్రమాదాలకు కారణము. తాజాగా ఇంటికి ఆసరగా ఉన్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదం అంటే ఒక ప్రాణం పోవడమే కాదు ఒక కుటుంబం రోడ్డున పడుతుంది. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనం నడపటం వంటివి ఈ ప్రమాదాలకు కారణం. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామం లో పిన్నింటి లక్ష్మి(22) అనే యువతి..తన తల్లితో నివాసం ఉంటుంది. ఆమె తండ్రి కొన్నాళ్ల క్రితమే మరణించాడు. దీంతో లక్ష్మి తల్లి పెంటమ్మ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. లక్ష్మి ఎల్విన్ పేట సచివాలయంలో ఎంఎల్ హెచ్ పీగా ఉద్యోగం చేస్తుంది. ఈమెతో పాటు అనూష అనే మరో యువతి కూడా అక్కడే పనిచేస్తుంది. అనూష స్వగ్రామం కొమరాడమండలం లోని శివుని గ్రామము. ప్రతి రోజూ లక్ష్మీ.. ఆమె స్నేహితురాలు అనూషతో కలసి ఆఫీస్ కు వెళ్తుండేది.
రోజూ లాగానే సోమవారం కూడా వీరిద్దరూ తాడికొండ పీహెచ్ సీకి బైక్ పై బయలు దేరారు. ఈ సమయంలో కొత్తగూడెం రోడ్డు సమీపంలోకి రాగానే ఎండకు పెట్టుకున్న అనూష టోపి గాలికి పైకి ఎగిరింది. అనుషా ఆ టోపిని పట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో వారి బైక్ అదుపుతప్పడంతో వెనుక కూర్చున్న లక్ష్మీ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమైంది. తీవ్రమైన గాయలైన లక్ష్మీ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ప్రమాదానికి గురైన వీరిద్దరిని అటుగా వెళ్తున్న స్థానికలు గమనించి.. దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే లక్ష్మీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో యువతి అనూషకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి మృతితో ఆమె ఇంట్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి. కుమార్తెకు ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని ఆదుకుంటుందని లక్ష్మి తల్లి ఎంతో సంతోషపడింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడడంతో లక్ష్మి తల్లి బోరన విలపించింది. ఆమెను ఓదార్చడం అక్కడ ఎవరి తరం కాలేదు. మరి.. ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.