గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి షాక్ తగిలింది. మాజీ మంత్రి.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి గా ఉంటున్న రావెల కిషోర్ బాబు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏపిలో చర్చనీయాంశంగా మారింది. ఈ రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన విధానం తనకు ఎంతోబాగా నచ్చిందని.. అందుకే ఆ పార్టీలో చేరానని.. ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో భారత్ నిలిపేందుకు మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారని రావెల తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
గతంలో ఐఆర్ఎస్ గా కొనసాగిన ఆయన రాజకీయాలపై మొగ్గుచూపారు. చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రిపదవి ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లారు.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడ నుంచి వచ్చి బీజేపీలో చేరారు. ఇటీవల కాలంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఎంతో గౌరవం ఇచ్చిన సోము వీర్రాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో అన్న విషయం పై చర్చ కొనసాగుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.