సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాదిలానే గోదావరి జిల్లాలో కోళ్ల పందేలు జరుగుతున్నాయి. వాటికి తోడు ఈ సారి వైరటీగా పందుల కుస్తీలు పోటీలు కూడా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పందుల పోటీలను నిర్వహించారు. ఈ పందుల కుస్తీ పోటీలను చూడడానికి స్థానికులు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు మాట్లాడుతూ.. తాము సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయానికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. అంతేకాదు కత్తులతో కోడిపందాలు, గుండాట వంటి జూదాల తో కుటుంబాలు ఆర్ధికంగా పతనవుతున్నాయని.. అందుకనే తాము మళ్ళీ సంప్రదాయ వేడుకలకు తెర తీసినట్లు చెప్పారు. ఏ విధమైన ప్రాణహాని లేకుండా రెండు జీవుల మధ్య జరిగే ఈ ఆట అందరికీ ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని భావిస్తున్నామని చెప్పారు. మరి ఈ పందుల పోటీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.