తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను ఆశలకు తగినట్లుగా కష్టపడి చదివి.. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం విధి చిన్న చూపు చూస్తుంది. తాజాగా విధి ఆడిన వింత నాటకానికి ఓ కుటుంబంలో విషాదం నిండింది.
తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను ఆశలకు తగినట్లుగా కష్టపడి చదివి.. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం విధి చిన్న చూపు చూస్తుంది. కుటుంబం కోసం కష్టపడుతున్న సమయంలోనే ఏదో ఒక రూపంలో మృత్యువు పిలుస్తుంది. దీంతో తల్లిదండ్రుల ఆశలు సమాధి చేస్తూ గుండెలను బరువెక్కిస్తూ కొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామానికి చెందిన అందే నాగపుష్ప అనే 15 విద్యార్థిని పరిమెళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పుష్ప తండ్రి మూడేళ్ల క్రితం మరణించాడు. దీంతో వారి కుటుంబ బాధ్యతలంతా నాగపుష్ప తల్లి చూసుకుంటుంది. తల్లి కష్టాన్ని చూసిన ఆ విద్యార్థిని బాగా చదువుకుని.. కుటుంబానికి తోడుగా ఉండాలని కలలు కనేది. అందుకు తగినట్లే నిత్యం బాగా కష్టపడి చదువుతుండేది. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం జల్లి కొమ్మరలో ఆ యువతి వాళ్ల తాతయ్య కవల నాగరాజు నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి నుంచి నాగపుష్ప చదువుకునే స్కూల్ దగ్గరగా ఉండేది.
దీంతో ఆ విద్యార్థిని తాతయ్య కవల నాగరాజు వద్ద ఉంటూ చదువుతోంది. మంగళవారం తన స్వగ్రామం ఖండవల్లిలో ఉంటున్న తల్లి చూడాలని భావించింది. దీంతో నాగపుష్ప తాతతో కలసి ద్విచక్రవాహనంపై ఖండవల్లికి బయలుదేరింది. మార్గంమధ్యలో దువ్వ గ్రామానికి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను మంచినీటి ట్యాంకర్ ఢీకొంది. దీంతో నాగపుష్ప ట్యాంకర్ కింద పడి.. అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి తాత నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థిని మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక తనకు తోడుగా ఉంటందని భావించిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లి గుండెలు పగిలేలా విలపించింది.