ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్షం కానప్పటికీ ఆ పాత్రను జనసేనా పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో టీడీపీ వైసీపీ మధ్యకంటే.. వైసీపీ, జనసేన మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి, అధికార పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే పోటాపోటీగా సభలో సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పవన్ కల్యాణ్ యువశక్తి సభ నిర్వహించారు. ఈ సందర్భాగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఇదే సభలో ప్రపంచ కప్ గెలిన భారత్ అంధ క్రికెట్ చెందిన నలుగురు ఆంధ్ర క్రికెటర్లకు పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం ప్రకటించారు.
గురువారం శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అంతేకాక ఈ సభకు జనసైనికులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పవన్… అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రజలందరినీ హింసించే పాలకుడిని ఎదుర్కోవాలంటే.. మనకు పడని వారితోనూ కలవాల్సిందే’ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీకి వెళ్తామని, అయితే అది గౌరవప్రదంగా ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాల్సి అవసరం లేదని తెలిపారు. ఇక ఇదే సభలో పలువురు పేదలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేశారు.
ఇదే సమయంలో ప్రపంచ కప్ గెలిచిన భారత్ అంధ క్రికెట్ జట్టులోని నలుగురు ఆంధ్ర క్రికెటర్లకు ఆర్ధిక సాయం అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 50 వేల చోప్పున ఆర్ధిక సాయం పవన్ కల్యాణ్ చేశారు. అలానే గతేడాది అనుమానస్పద స్థితిలో మరణించిన నువ్వుల రేవుకు చెందిన విద్యార్ధి నగేశ్ తల్లికి కూడా పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం చేశారు. అలానే పలువురు పేదలకు రూ.2 లక్షలు, రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. పేదలకు సాయం చేయడంలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడు ముందు ఉంటారని ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు అంటున్నారు.
తాజాగా భారత్ కి ప్రపంచ కప్ అందించిన అంధల క్రికెట్ టీమ్ ను పవన్ కల్యాణ్ అభినందించారు. యువశక్తి సభ వేదిక మీదగా భారత్ అంధ క్రికెట్ జట్టులోని ఆంధ్రకు చెందిన నలుగురు అంధ క్రికెటర్లకు అభినందనలు తెలిపారు. సభ వేదికపై క్రికెటర్లను పవన్ కల్యాణ్ సన్మానించారు. అలానే వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మరి.. పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆర్థిక సాయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.