నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం తెల్లవారుజామున బహుదా నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలానే పురాతన వంతెనల కూలిపోయి.. ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ లో వంతెన పై నుంచి ఓ ట్రాక్టర్ ట్రక్కు నదిలో పడి 15 మంది దుర్మరణం చెందారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం వెళ్తుండగా బహుదా నదిపై నిర్మించిన పురాతన వంతెన కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని బహుదా నదిపై ఉన్న వంతెన బుధవారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో కుప్పుకూలిపోయింది. ఇచ్చాపురం టౌన్ కు ఎంట్రన్స వద్ద ఈ వంతెన ఉంది. దీనిని 1929లో అప్పటి మద్రాసు ప్రభుత్వం నిర్మించింది. 29 అడుగుల ఎత్తు ఉన్న ఈ వంతెన ఇచ్చాపురంతో పాటు పలు ప్రాంతాలకు ప్రధాన రహదారిగా ఉంది. ఈ వంతెన పై నుంచి నిత్యం భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. బుధవారం ఉదయం 70 టన్నుల బరువున్న రాళ్ళ తీసుకెళ్తున్న లారీ.. వంతెన మీదకు వెళ్లే సరికి ఒక్కసారిగా అది కూలిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
క్షతగాత్రులైన డ్రైవర్, క్లీనర్‌ను ఆసుపత్రికి తరలించారు. ట్రక్కును వెలికి తీసే పనులను చేపట్టారు. బ్రిడ్జి సామార్థ్యానికి మించిన బరువు గల వాహనం దీని మీదుగా రాకపోకలు సాగించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇచ్ఛాపురం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇచ్ఛాపురం మండలానికి మంచినీరు, సాగునీటికి బహుదానది ప్రధాన వనరుగా ఉంది. ఈ నది పరిధిలో 5 వేల హెక్టార్ల మేర ఆయకట్టు ఉంది. సుమారు 15 గ్రామాల రైతులు దీనిపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇచ్చాపురం లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. అలానే ఈ నెల 15 వరకు సంబరాలు భారీ సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెపథ్యంలో హైవే నుండి రద్దీని మల్లించేందుకు మరో దారిని కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేయగలరని స్థానిక ప్రజలు సంబంధిత అధికార్లకు విజ్ఞప్తి చేశారు. మరి.. ఇలా పురాతన కట్టడాలు కూలిపోకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.
కుప్పకూలిన ఇచ్ఛాపురం వంతెన..!! pic.twitter.com/zTxfiDp9GP
— oneindiatelugu (@oneindiatelugu) May 3, 2023