ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. తరచుగా ఆమెకు సంబంధించిన ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
1990లలో సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన రోజా ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోని టాప్ హీరోలందరితోనూ ఆమె సినిమాలు చేశారు. ఆమె తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీనుంచి ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నగరి స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ మరోసారి ఆమె తన సత్తా చాటారు. ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటినుంచి ఆమె తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉన్నారు. ప్రతి పక్షంనుంచి అధికార పక్షంలోకి వచ్చినా వివాదాలు ఆగటం లేదు. కొన్ని విషయాలు ఆమెకు సంబంధం లేకుండానే ఆమెను వివాదాల్లో నిలుపుతున్నాయి. తాజాగా, కూడా ఆమె ఓ వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? వివాదానికి కారణం అయ్యేంతలా అందులో ఏముంది? ..
మంత్రి రోజా తాజాగా, బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో పర్యటించారు. పర్యటన సందర్భంగా ఆమె తన చెప్పులు తీసి సముద్రంలోని అలల వద్దకు వెళ్లారు. ఎంతో సంతోషంగా అలల మధ్య తిరిగారు. మంత్రి రోజా పీఏ ‘మేడమ్ చెప్పులు జాగ్రత్త’ అని పర్యాటక శాఖ ఉద్యోగులను ఆదేశించారట. దీంతో స్థానికంగా రిసార్ట్స్ లో పనిచేసే ఓ చిరుఉద్యోగి ఆమె చెప్పుల్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మంత్రి అలల దగ్గరి నుంచి బయటకు వచ్చే వరకు ఆ చెప్పుల్ని అలాగే మోస్తూ ఉన్నాడు. మంత్రి బయటకు రాగానే అతడి దగ్గరినుంచి చెప్పుల్ని తీసేసుకున్నారు. ఇలా మంత్రి చెప్పులు మోయించటాన్ని సామాన్య జనం తప్పుబడుతున్నారు. సామాన్య ఉద్యోగులంటే అలుసా అని ప్రశ్నిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.