New District In AP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో పాలనకూడా ప్రారంభమైంది. అయితే, 26 జిల్లాకు తోడుగా మరో కొత్త జిల్లా రాబోతున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి పేర్నినాని మరో కొత్త జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గిరిజన ప్రాంతాలన్నింటిని కలిపి ఒక జిల్లాగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారని తెలిపారు.
కాగా, ఏపీలో కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసింది. సోమవారం ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించారు. త్వరలో రాబోతున్న కొత్త జిల్లాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అప్పుడు సీఎం జగన్‌ను తిట్టుకున్నా.. వాళ్లు ఎవర్నీ లెక్క చేయరనుకున్నా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.