టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 84వ రోజుకి చేరుకుంది. 84వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని లోని నందవరం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 84వ రోజుకి చేరుకుంది. 84వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా నందవరం విడిది కేంద్రంలో 1000 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. 84వ రోజు ఎమ్మిగనూరు నియోజవర్గంలోని నందవరం నుంచి యాత్ర ప్రారంభమైంది.
ఇప్పటి వరకూ నారా లోకేష్ 1073.9 కిలో మీటర్ల దూరం నడించారు. పాదయాత్రలో వడ్డెర సామాజికి వర్గీయులు యువనేత లోకేశ్ ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలిపారు. నందవరం ప్రాంతంలో జోరు వాన కురిసింది. ఈ వానలో కూడా లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించాడు. వర్షం కురుస్తున్నా లోకేశ్ ని చూసేందుకు భారీగా జనం రోడ్లపైకి వచ్చారు. వర్షంలో తడుస్తూనే అందరికీ అభివాదం చేస్తూ లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు.
ఈ పాదయాత్రలో కురుబ సామాజికవర్గీయులతో లోకేశ్ భేటీ అయ్యారు. జగ్గాపురం గ్రామస్తులతో లోకేశ్ సమావేశమయ్యారు. 5.30 గంటలకు బాపురం గ్రామంలో బొప్పాయి రైతులతో సమావేశం అవుతారు. ముగటి గ్రామంలో పిలేకమ్మ దేవాలయం వద్ద ధర్మాపురం గ్రామస్తులతో సమావేశమవుతారు. ఇక పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలా లోకేశ్ 84వ రోజు పాదయాత్ర కొనసాగింది. మరి.. 84వ రోజు ఎమ్మిగనూరులో జరిగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.