టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వ రోజుకి చేరుకుంది. 80వ రోజు పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలోని తుంబళం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 80వ రోజుకి చేరుకుంది. 80వ రోజు పాదయాత్ర ఆదోని నియోజకవర్గంలోని తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా తుంబళం విడిది కేంద్రంలో 1000 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. 80 రోజు తుంబళం క్రాస్ రోడ్డు వద్ద ప్రారంభమైన పాదయాత్ర, మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ కి అక్కడి టీడీపీ ఇన్ ఛార్జ్ తిక్కారెడ్డి, ఇతర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఇక లోకేశ్ పాదయాత్రలో దారి పొడవును టీడీపీ అభిమానులు భారీగా కదలి వచ్చారు. రోడ్డు అంత పసుపు మయంగా మారింది. లోకేశ్ పై పూలు జల్లుతో స్థానికులు ఘన స్వాగంత పలికారు. లోకేశ్ .. స్థానికుల సమస్యలు తెలుకుంటూ, వాటి పరిష్కార హామిలు ఇస్తూ తన పాదయాత్రను ముందుకు సాగించారు. ఆదోని, మంత్రాలయ నియోజకవర్గ ప్రజలతో ఆయన మమేకమయ్యారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారితో యువనేత ముచ్చటించారు. అలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ పాదయాత్ర సాగింది. మరి.. 80వ రోజు మంత్రాలయం నియోజక వర్గంలో జరిగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.