ప్రస్తుతం నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. తారకరత్న కోసం నిష్ణాతులైన వైద్యులు పని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తారకరత్న మెదడుకి స్కానింగ్ చేసిన వైద్యులు.. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించనున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
కాగా ఇప్పుడు తారకరత్న చికిత్సకు సంబంధించిన ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు ఎవరు భరిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. నందమూరి వారిలో బాలకృష్ణ సహా మిగతా హీరోల్లా తారకరత్నకు పెద్దగా ఆస్తులు లేవని, దీంతో ఆయన చికిత్సకు ఖర్చు ఎవరు భరిస్తున్నారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆర్థికంగా తారకరత్న వెనకబడి ఉన్నారని.. చికిత్సకయ్యే ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు భరించే స్థితిలో ఆయన కుటుంబ సభ్యులు లేరన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తారకరత్న సతీమణి, ఆయన తండ్రి మోహనకృష్ణ చికిత్స విషయంలో తడబడుతుంటే.. నందమూరి, నారా కుటుంబ సభ్యులు మేమున్నామన్న ధైర్యాన్ని ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కెర్లు కొడుతోంది.
తారకరత్న బయట మనిషి కాదు, మా మనిషే, మన మనిషే అని.. తారకరత్న తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేవరకూ మొత్తం ఖర్చంతా తామే పెట్టుకుంటామని బాలకృష్ణ హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ మొదటి నుంచి తారకరత్నతోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం, బాగోగులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణతో పాటు మిగతా కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు కలిసి చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రి బిల్లులు కూడా ఇరు కుటుంబ సభ్యులు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ తారకరత్న విషయంలో బాలకృష్ణ దగ్గరుండి చూసుకోవడం మాత్రం అభిమానులకు, ముఖ్యంగా తారకరత్న కుటుంబానికి కొండంత అండను, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.