ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వస్తున్నా ప్రతిరోజూ ఎక్కడ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ మంత్రి విడుదల రజినీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. కాకపోతే మంత్రి ఇన్నోవా స్వల్పంగా దెబ్బతిన్నది.
ప్రస్తుతం ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి విడుదల రజినీ ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మర్కాపురంలో ఇటీవల నిర్మించిన నూతన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి విడుదల రజినీతో పాటు ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు వీలుగా ఏపిలో పలు నూతన ఆస్పత్రి నిర్మాణాలు జరగుతున్నాయని మంత్రి విడుదల రజినీ ఈ సందర్భంగా తెలిపారు.
ఇక ఆసుపత్రి ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత మంత్రి రజినీ కాన్వాయ్ కొనకనమిట్ల కు బయలుదేరింది. మంత్రి రజినీ ప్రయాణిస్తున్న ఇన్నోవాకు ముందు భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వెళ్తుంది. ఆ కాన్వాయ్ కి మంత్రి వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి విడుదల రజినీ వాహనం పాక్షికంగా దెబ్బతింది.