ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది మంత్రికి ప్రథమ చికిత్స అందించారు.
మంత్రి విడుదల రజని ఎపిలో 2019లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించింది. విడదల రజిని 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. కాగా యువ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో అక్కడ కొంత ఆందోలనకరమైన వాతావరణం నెలకొంది. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆమెకు ఒఆర్ఎస్ అందించారు.
ఎపి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.. కార్యక్రమం జరుగుతుండగా మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన వైద్యులు మంత్రికి ఒఆర్ఎస్ అందించారు. మంత్రి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేకపోవడంతో అధికారులందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్న మంత్రి విడదల రజని కార్యక్రమాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు. కాగా త్వరలో ఎపిలో ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అధికార ప్రతిపక్షనాయకులు వారి వారి నియోజకవర్గాల్లో బిజీబిజీగా తిరుగుతున్నారు. దీనిలో భాగంగానే మంత్రి విడుదల రజని తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.