ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పలు తుఫాన్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో తుఫాన్ల వల్ల భారీగా ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఆగ్నేయ బంగాళా ఖాతంలో మాండూస్ తుఫాన్ ప్రభావం బీభత్సంగా ఉంది. ఈ ప్రభావం వల్ల ఏపిలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. చిత్తూరు తో పాటు నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.. పలు స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు . పునః ప్రారంభంపై సమాచారం ఇస్తామని తెలిపారు.
ఏపీలో మాండూస్ తుఫాన్ ముంచుకొస్తుందని అధికారులు తెలిపారు. చెన్నైకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృమైన మాండూస్ 12 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో తీవ్రమైన చలి గాలులు వీస్తుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే 6 గంటల్లో తుఫాన్ తీవ్రత కొనసాగించి తర్వతా క్రమంగా బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ) వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా సాగి ఈ రోజు అర్థరాత్రి పుదుచ్చేరి, శ్రీహరి కోట, మహా బలిపురం సమీపంలో తీరం చేరనున్నట్లు ఐఎండీ తెలిపింది.
మాండూస్ తుఫాన్ కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావం చూపించే జిల్లాల్లో సుమారు 210 మండలాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ హెచ్చిరికలు జారీ చేస్తూ సందేశాలు పంపుతున్నారు. ఇక తుఫాన్ తీరం చేరే సమయానికి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడిచింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు సైతం మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నట్లు ఐఎండీ ప్రకటించడంతో ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్, ఎపీడీఆర్ఎఫ్ బృందాలు ఒంగోలుకు చేరుకున్నాయి. ఏపీతో పాటుగా తమిళనాడు రాష్ట్రాల్లో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. పర్యాటక స్థలాలను మూసి వేయాలని సూచించారు అధికారులు. ఎలాంటి విపత్తు వచ్చినా సిబ్బందితో సహాయక చర్యలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎపీడీఆర్ఎఫ్ దళాల అధికారులు తెలిపారు.
#CycloneMandous around 180 kms southeast of Mahabalipuram and will cross around 9 th midnight to 10th Dec early morning.
Max impact: Max 80kmph wind speed with heavy rain; ChengalPattu,Kanchipuram,Tambaram,South Chennai pic.twitter.com/uLKTHgjzB1— Chennai Weather (@chennaiweather) December 9, 2022