ఏపీకి మోచా తుఫాను ముప్పు పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రకృతి విలయం సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి ప్రకృతి విలయానికి ఓ ఖండం విలవిలలాడుతోంది. తాజాగా అక్కడి ఓ దేశంలో తుపాను ధాటికి 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ సీఎం జగన్ మరోసారి రుజువు చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో మాండూస్ తుపాను, భారీ వర్షాలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, కలెక్టర్లు నష్టం అంచనా విషయం ఎంతో ఉదారంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదంటూ సూచించారు. ఏ ఒక్క రైతు కూడా అధికారుల నష్టం అంచనాతో […]
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పలు తుఫాన్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో తుఫాన్ల వల్ల భారీగా ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఆగ్నేయ బంగాళా ఖాతంలో మాండూస్ తుఫాన్ ప్రభావం బీభత్సంగా ఉంది. ఈ ప్రభావం వల్ల ఏపిలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుమలపై పడింది. చిత్తూరు తో పాటు నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో భారీగా వర్షాలు […]
ప్రకృతి కన్నెర్ర చేయడంతో క్యూబా దేశం వణికిపోయింది. క్యూబాలో ఇయన్ తుఫాన్ భీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావానికి వేలాది చెట్లు నేల మట్టమయ్యాయి. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పలువురి ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంటి పై కప్పులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పినార్ డెల్ రియో ప్రాంతంలో ఇయన్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై ఎక్కడికక్కడ వేలాది చెట్లు అడ్డంగా పడిపోవడం, రహదారులపైకి, ఇళ్లపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు […]
విశాఖపట్నం- ఇప్పటికే అకాల వర్షాలతో అతలాకుతరం అయిన ఆంధ్రప్రదేశ్ ను మరో తుఫాను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు తుఫాను సిద్దంగా ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి శుక్రవారం తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుఫాన్ గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. దీనికి సౌదీ అరేబియా సూచన మేరకు జవాద్ అనే పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రస్తుతం గంటకు 22 […]
వెధర్ రిపోర్ట్- మొన్న ముంచుకొచ్చిన గులాబ్ తుఫాను నుంచి తేరుకునేలోపే మరో తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతవరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫానుకు షహీన్ అనే పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎండీ స్పష్టం చేసింది. గుజరాత్ లోని దేవ్ భూమి ద్వారకకు 700 కిలోమీటర్లు, తూర్పు నైరుతిగా ఇరాన్ […]
పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్’ తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, తీర ప్రాంతాల్లో ముప్పున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్-19 సోకి చికిత్స పొందుతున్న వారికి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు విద్యుత్తు, సమాచార వ్యవస్థలు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని […]
న్యూ ఢిల్లీ- తౌక్టే తుఫాను బీభత్సం నుంచి తేరుకోక ముందే మరో తుఫాను ముంచుకొస్తోంది. కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను తౌక్టే సైక్లోన్ అతలాకుతలం చేసింది. జన జీవనాన్ని అస్థవ్యస్తం చేయడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు మరో తుఫాను దాడికి సిద్దంగా ఉంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ తెలిపింది. ఈ […]
మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. తౌక్టే తుపాన్ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్‌జిసి ఉద్యోగులు ఉన్నారు. […]