ఏపీలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే కారణంతో తమ్ముడు అన్న పళ్లు పీకాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే.. మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూఢ నమ్మకాలు, చేతబుడులు అంటూ బతికేస్తున్నారు. ఇక మరికొందరైతే చేతబడుల పేరుతో ఏదేదో చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. చేతిబడి చేస్తున్నాడనే అనుమానంతో తమ్ముడు అన్న పళ్లు పీకేశాడు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఏపీలోని కాకినాడ నిలాద్రిరావుపేటలో చిన్నబాబు, శ్రీనివాస్ అనే సోదరులు నివాసం ఉంటున్నారు. అయితే చిన్న బాబు అనే వ్యక్తి గ్రామంలో చేతబడి చేస్తున్నాడని ఊరు మొత్తం చర్చించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటీవల తమ్ముడు అయిన శ్రీనివాస్ కుమారుడు ఆనారోగ్యానికి గురయ్యాడు. ఇది పక్కా మా అన్న బాబు పనే అనుకున్నాడు శ్రీనివాస్. మా అన్న చేతబడి చేయడంతోనే నా కుమారుడు అనారోగ్య పాలయ్యాడని భావించాడు. ఇక ఇదే కోపంతో శ్రీనివాస్.. అన్న బాబుకు ఎలాగైన బుద్దిచెప్పాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే.. వికలాంగుడైన అన్న బాబుని పట్టుకుని శ్రీనివాస్ దారుణంగా ప్రవర్తించాడు. కొందరి వ్యక్తుల సాయంతో బాబు పళ్లను పీకేశాడు. నా తప్పేం లేదని ఎంత అరిచినా వినకుండా క్రూరంగా ప్రవర్తించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అన్న చేతబడి చేస్తున్నాడని పళ్లు పీకేసిన తమ్ముడి ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
తన అన్న చేతబడి చేస్తున్నాడని అనుమానంతో పళ్లు పీకేసిన తమ్ముడు
కాకినాడ – నీలాద్రి రావు పేట గ్రామానికి చెందిన పసగుడుగుల చినబాబుపై, తమ్ముడు శ్రీనివాస్ తన కుమారునికి అనారోగ్యం కలగడంతో తన అన్న చేతబడి చేశాడని అనుమానంతో వికలాంగుడైన అన్నపై దాడి చేసి నాలుగు పళ్ళు పీకేశాడు.#Kakinada pic.twitter.com/JL7miJgZIL
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2023