గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత అయిదు వారాలుగా పెండింగ్ లో ఉన్న చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి కూలీల బ్యాంక్ అకౌంట్లలో పెండింగ్ వేసవి భత్యాలు జమ చేయనున్నారు.
మన దేశం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుటకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరింపజేసి అన్ని వర్గాల వారు ఆర్థికాభివృద్ధి సాధించుటకు కృషి చేస్తుంది. అందులో గ్రామీణ ప్రజల కొరకు జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఒకటి. గ్రామీణ ప్రజల జీవన భద్రతను పెంపొందించడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. సాధారణంగా పనులకు వచ్చిన కూలీలు వేసవికాలంలో కూలీలకు ఇచ్చే వేసవి భత్యం ఇవ్వనందున గత అయిదు వారాలుగా నిలిచిన డబ్బులు కూలీల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. కొన్నిజిల్లాల్లో ఇప్పటికే చెల్లింపులు ప్రారంభించారు. ఇక త్వరలోనే ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉపాధి కూలీ డబ్బులు వారి ఖాతాల్లో జమ కానున్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు.
గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత అయిదు వారాలుగా పెండింగ్ లో ఉన్న చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి కూలీల బ్యాంక్ అకౌంట్లలో పెండింగ్ వేసవి భత్యాలు జమ చేయనున్నారు. వేసవిలో తీవ్రమైన వడగాల్పులు వీచేటప్పుడు కూడా కూలీలు పనులు చేయగా ప్రభుత్వం వేతనాలు బకాయిలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్లకు పైగా చెల్లింపులు బకాయి పెట్టారు. కూలీలు చేసిన పనుల వివరాలు వీక్లీ వన్స్ ఎన్ఐసీ పోర్టల్ లో అప్‌లోడ్ అవుతాయి. అప్‌లోడ్ చేసిన వారం రోజుల తర్వాత చెల్లింపులు చేస్తారు. కానీ ఈ సారి గత 5 వారాలుగా చెల్లంపులలో జాప్యం జరిగింది.
గ్రామాల్లో ఉండే నిరుపేదలకు ఉపాధి పనులే జీవనాధారం కాబట్టి వారు చెల్లింపుల జాప్యంతో ఇబ్బందులకు గురవుతున్నారు. చెల్లింపుల్లో కొంతవరకు జాప్యం అయిన విషయం వాస్తవమేనని.. కేంద్రప్రభుత్వం రెండు, మూడు విడతలుగా నిధులు విడుదల చేస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. కూలీల వేతనాలు రూ. 110 కోట్లకు పైగా నిధులు రిలీజ్ చేసిందని ఆయన వెల్లడించారు. కొన్ని జిల్లాలో కూలీల అకౌంట్లలో వేతనాలు జమ అవుతున్నట్లు.. మిగతా జిల్లాల్లో కూడా త్వరలో చెల్లింపులు జరుగుతాయని ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ పథకం అమలుకు అన్ని రాష్ట్రాలనూ ఎస్ఐసీ పోర్టల్ పరిధిలో చేర్చిన కారణంగా కూలీలకు అదనపు భత్యం చెల్లించలేదన్నారు. తాగునీరు, మజ్జిగ సరఫరా సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు.