ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పరీక్ష తేదీలకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్ధులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది.
సాధారణంగా పాఠశాల విద్యార్ధులు రెండే విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందులో ఒకటి పరీక్షల గురించి కాగా, మరొకటి సమ్మర్ హాలీడేస్ గురించి. విద్యా సంవత్సరం చివరకి వచ్చేస్తే చాలు..వారి మెదళ్లలో వీటి గురించే ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడెప్పుడు వేసవి సెలవుల తేదీలు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తుంటారు. సమ్మర్ లోఎంజాయ్ చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.ఈ నేపథ్యంలోనే విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి కాలం సెలవులు ఎప్పటి నుంచి అనే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక పూర్తి వివరాల్లకో వెళ్తే.
ఇప్పటికే వేసవికాలం సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్ధులు కూడా వేసవి సెలవుల సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం సమ్మర్ హాలీడేస్ విషయంపై కీలక ప్రకటన చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలోని 1 తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27 వరకు జరగనున్నాయి. పరీక్షల అనంతరం మరో రెండు రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి.
ఈ రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించడం, పేరెంట్స మీటింగ్స్ ను ఏర్పాటు చేయడం వంటివి ఉంటాయి. మార్కులు వెల్లడించిన అనంతరం ఏప్రిల్ 30 నుంటి పాఠశాలకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక సమ్మర్ హాలీడేస్ అనంతరం జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇంకా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ప్రతీ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటాయి. మరి.. తాజాగా వచ్చిన ఈ విద్యాశాఖ సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.