ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా నడుస్తున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరులోకి దిగుతారా? పొత్తులతో రంగంలోకి దిగుతారా అన్న విషయంపై ఏపి రాజకీయాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గతంలో తాము ఎన్నోసార్లు త్యాగాలు చేశామని.. ఇక ముందు త్యాగాలకు ఏమాత్రం సిద్దంగా లేమని అన్నారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమయ్య టీడీపీ మళ్లీ తననే తగ్గమనడం కరెక్టు కాదని.. ఈ విషయంలో తెలుగుదేశం నేతలే ఆలోచించుకోవాలి అన్నారు.
ఇవి కూడా చదవండి : Ben Stokes: మళ్ళీ అదే బెన్ స్టోక్స్.. ఇది మామూలు అదృష్టం కాదు!
ఓ వైపు పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిస్తే.. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఖ్యింటా కాట తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి… కానీ ఆ కొన్ని వడ్లు వల్లనే మొత్తం కాట తుగింది అనుకుంటే ఎలా….సేనాధిపతి…!’ అంటూ ట్విట్ చేశారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తులపై తనదైన క్లారిటీ ఇచ్చిన వేళ ఎమ్మెల్యే గోరంట్ల ఇలా ట్వీట్ చేయడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Divya Pandey: సివిల్స్‌లో 323వ ర్యాంకు వచ్చిందని సంతోష పడింది.. అంతలోనే..
ఖ్యింటా కాట తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి…
కానీ ఆ కొన్ని వడ్లు వల్లనే మొత్తం కాట తుగింది అనుకుంటే ఎలా….సేనాధిపతి…!#గోరంట్ల🔥#BringBackCBN— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) June 5, 2022