ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. త్వరలో నగదు బదిలీ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ముందు రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. ఒకవేల బియ్యం వద్దు అనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇస్తుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఎలాంటి బలవంతం ఉండదని.. అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు పంపిణీ చేస్తారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జీవీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలు ఎంచుకున్నారు. ఇది దశలవారీగా కొనసాగించి సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం అమలు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వలంటీర్ల ద్వారా ఈ నెల 18 నుంచి 22 వరకు అంగీకార పత్రాలు తీసుకోనున్నట్లు తెలిపారు. బియ్యానికి బదులుగా నగదు కావాలని అంగీకార పత్రం ఇచ్చే వారికి ఆ తర్వాత కావాలంటే మళ్లీ బియ్యం ఇస్తారు. అయితే ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం.. రూ. 12 నుంచి రూ. 15 మధ్య వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నగదు పంపినీ మొదట వలంటీర్ల ద్వారా చెల్లిస్తారు.