ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఏడాది కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం.. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచారు. తాజాగా గరికపాటి మరో వివాదంలో చిక్కుకున్నారు. సుమారు 16 ఏళ్ల నాటి ఓ వీడియోతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆ వివరాలు..
2006 సంవత్సరంలో గరికపాటి ఓ చానెల్ ఓ ఏర్పాటు చేసిన హస్యం అనే కార్యక్రమంలో భాగంగా స్వర్ణకార వృత్తికారుల గురించి వ్యాఖ్యానించారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు తమను అవమానించే విధంగా ఉన్నాయంటూ.. వారు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాల భీమవరంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ క్రమంలో ఇదే రోజు గరిక పాటి ఆనంద ఫంక్షన్ హాల్‌లో ప్రసంగం ఉండడంతో అక్కడకు వచ్చారు.
గరికపాటిని చూసిన స్వర్ణకారులు రోడ్డుపై భైఠాయించి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వాహనాలను అడ్డుకున్నారు. తన వ్యాఖ్యల కారణంగా ఆందోళన చేపట్టిన స్వర్ణకారులకు ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పారు. పోలీసులు అక్కడకి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఆయన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో చర్చించారు. తన వ్యాఖ్యల వల్ల స్వర్ణకారులు బాధపడుతున్నందున వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు. దీంతో స్వర్ణకారులు ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. 16 ఏళ్ల క్రితం జరిగిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది అన్నారు. అప్పుడు కూడా సరదాగా, సానుభూతితో మాత్రమే చెప్పానన్నారు. తాను ఏ ఉద్దేశంతో చెప్పినా వారు బాధపడ్డారని.. స్వర్ణకార సోదరులు బాధపడితే తన కొడుకు బాధపడినట్లే అన్నారు. హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి కాపాడటమే తన లక్ష్యమన్నారు. ప్రజల ప్రేమతో పద్మ శ్రీ అవార్డు తనకు వచ్చిందన్నారు. వారు ఎంతో బాధపడి ఉంటారని.. అందుకే క్షమాపణలు చెబుతున్నానన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.