రాయలసీమ అంటే రత్నాల సీమ అని విజయనగర సామ్రాజ్యకాలం నుంచే పేరు. అవునూ నిజంగానే రాయలసీమ రత్నాల సీమ. కరువుకు మారుపేరుగా మారిన ఈ ప్రాంతంలో రత్నాలు కుప్పలు తెప్పలుగా దొరకుతున్నాయి. అందుకే వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలోని ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. తమను అదృష్ట లక్ష్మి వజ్రాల రూపంలో తలుపు తడుతుందేమో అని ఆశతో ఆసక్తిగా పొలాల్లో వెతుకుతుంటారు. అలా కొందరికి వజ్రాలు దొరికి లక్షల రూపాయలు సంపాందించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ వ్యవసాయ కూలీకి రెండు వజ్రాలు దొరికాయి. వీటిని రూ.1.50 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వజ్రాల కోసం ఎగపడుతున్నారు. కొందరికి చిన్నపాటి వజ్రాలు కూడా దొరికినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలికి రెండు వజ్రాలు దొరికాయి. ఓ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో విషయం తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలోని ఓ వ్యక్తి మరో వజ్రం దొరికింది. దీంతో వజ్రాల కోసం అధిక సంఖ్యలో జనాలు ఎగపడుతున్నారు. జొన్నగిరి గ్రామాన్ని, వజ్రాలను అడ్డగా చేసుకుని వ్యాపారులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. వజ్రాల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనాలు వచ్చి.. తమ పంట పొలాలను నాశనం చేస్తున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసాంఘీక కార్యకలాపాలు సైతం సాగిస్తున్నారంటూ కొందరు రైతులు ఆరోపిస్తున్నారు.
తొలకరి వర్షాలకు సహజంగానే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ప్రాంతంలో అధికంగా వజ్రలు లభ్యమవుతుంటాయి. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో వజ్రలు బయట పడుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయానికి వెళ్లిన రైతుకు ఓ వజ్రం దొరికింది. దానిని స్థానిక వ్యాపారి లక్షన్నరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వజ్రల అన్వేషణ కోసం ఇతర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ఈ జొన్నగిరి ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ఈ వజ్రాల కోసం వచ్చే వారు పొలాల్లో తిరగడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వచ్చే వారిపై గ్రామ పెద్దలు ఆంక్షలు విధించారు. ఇతర ప్రాంతాల వారు ఎవరైన ఇక్కడకి వచ్చి వజ్రాల అన్వేషణ చేయరాదని తెలిపారు. మొలక దశలో ఉన్న పంటలు వీరు తొక్కడం వలన దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అంటున్నారు.
దీంతో రైతులు కొంత మందిని పొలాల వద్ద కాపలాగా ఉంచుతున్నారు. అయితే స్థానికంగా వ్యవసాయం కూలీకి వెళ్తున్న వారికే పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. వాటిని గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులకు అమ్మతున్నారు. వ్యాపారులు కూడా కూలీ బలహీనతను క్యాష్ చేసుకుని, పోలీసులకు తెలిస్తే అసలుకే ఏమి రావంటూ.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు పగటి సమయంలో పొలాల్లోకి రానివ్వడం లేదని రాత్రి వేళలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. మొత్తానికి కర్నూలు జిల్లాలోని పొల్లాల్లో కుప్పలు తెప్పలుగా వజ్రాలు దొరుకుతుంతడటంతో జనాలు ఎగపడుతున్నారు. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.