కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన రైతు మహ్మద్‌రఫీ వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి రెండెకరాల భూమి కలదు. అందులో పత్తి సాగు చేశాడు. పంటలో కలుపు తీయడానికి పెట్టుబడి ఖర్చులు లేక కలుపు పెరిగిపోతుండడంతో అతని ఇద్దరుకొడుకులు కాడెద్దులుగా మారి తండ్రికి సాయం చేశారు.
వ్యవసాయం చేసి పంటను పండించి దేశానికి అన్నం పెట్టేవారు రైతులు. రైతులకు ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినా కూడా వారి పరిస్థితి మారడంలేదు. ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చివరకు పంట చేతికందే సమయానికి కడగండ్లు తప్పడం లేదు. ఎద్దులను కొనే స్తోమత లేక, దున్నేందుకు గుంటుకకు ఎద్దులకు కిరాయి డబ్బులు లేని పరిస్థితిలో తన తండ్రి బాధ చూడలేక ఇద్దరు కొడుకులు కాడి మెడలపై పెట్టుకుని ఎద్దుల్లా గుంటుకతో కలుపు తీసే దృశ్యం కర్నూలులో కంటతడి పెట్టిస్తుంది. ఇటువంటి దృశ్యాలు గ్రామాల్లో అక్కడ దర్శనమిస్తాయి. కానీ వారి పరిస్థితులు మారేదెప్పుడో తెలియడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన రైతు మహ్మద్‌రఫీ వ్యవసాయం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి రెండెకరాల భూమి కలదు. అందులో పత్తి సాగు చేశాడు. పంటలో కలుపు తీయడానికి పెట్టుబడి ఖర్చులు లేక కలుపు పెరిగిపోతుండడంతో అతని ఇద్దరుకొడుకులు కాడెద్దులుగా మారి తండ్రికి సాయం చేశారు. కలుపు తీసేందుకు గుంటుకను లాగేందుకు ఎద్దులను కిరాయికి తీసుకుంటే రూ. వెయ్యి కావాలి. వెయ్యి రూపాయలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న తండ్రిని చూసి కొడుకులు సాయపడ్డారని మహ్మద్ రఫీ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్న కొడుకులు ఎద్దులలా మారి వ్యవసాయం చేసే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో పత్తి వేసిన రైతులు దిగులుకు లోనవుతున్నారు. ఎండలకు ఎర్ర తెగులుకు గురైన పత్తి పంట బాగా దెబ్బతింది. వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా వానలు విస్తారంగా పడక సాగు చేసేందుకు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటలు వేసేందుకు అనుకూల పరిస్థితుల కోసం వేచి చూసి పంటసాగు మొదలుపెట్టాక వానలు రాక రైతులు సతమతమవుతున్నారు. ప్రకృతిలో సంభవించే ఒడిదుడుకులకు బలి అయ్యేది కూడా రైతులే. అన్నదాతల కష్టాలు ఎప్పటికి తీరనివి.
ఇది ఇలా ఉంటే మరో వైపు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముతుకూరులో మరో దృశ్యం చూడవలసి వచ్చింది. తొలకరి మొదలవగానే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. అయితే ఈ సందర్భంలో ఓ రైతు తన నెలల బిడ్డను తీసుకుని పొలానికి వెళ్లాడు. కాడెద్దుల నాగలికి ఊయల కట్టి ఊయలో బిడ్డను పడుకోబెట్టారు. ఆలుమగలు పొలం పనులను చేసుకుంటున్నారు. ఈ సీన్ చూసినవారి మనసును కలిచివేసింది. కూలీల కొరతతో భార్యను పొలం పనులకు తీసుకువచ్చాడు. పాప చీరతో కట్టిన ఊయలలో సేదతీరుతుండగా వీరు పనులు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులను కూడా రైతులు ఎదుర్కొని పంటను పండిస్తారు. పండిన పంట ఇంటికి చేరే లోపే ప్రకృతి కన్నెర్ర జేసి ఏ గాలివానో, వడగండ్ల వానో దాడి చేస్తుంది. ఆరుగాలం కష్టపడే రైతుకు మిగిలేవి కడగండ్లే. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.