Lakshmi Narayana: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మోటివేషనల్ స్పీకర్‌గా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. లక్ష్మీనారాయణ ఎక్కడైనా కనిపిస్తే ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవటానికి జనం ఎగబడతారు. అలాంటిది ఆయనే ఓ సాధారణ కానిస్టేబుల్‌తో సెల్ఫీ తీసుకున్నారు. ఆయన ఆ కానిస్టేబుల్‌తో ఫొటో తీసుకోవటానికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. విజయవాడకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పీఎస్‌సీ బోస్ గతంలో 7 నెలల ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. పాపను పెంచి పెద్ద చేశారు.
ఇప్పుడు ఆమెను మమత మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిస్తున్నారు. డీఐజీ ఆఫ్ పోలీస్ పాల్‌రాజ్ ప్రోత్సాహంతో బోస్ ఆమెను దత్తత తీసుకున్నారు. దీంతో బోస్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాజాగా, విజయవాడ విమానాశ్రయంలో కనిపించిన బోస్‌తో లక్ష్మీ నారాయణ సెల్ఫీ దిగారు. బోస్ ఎంతో మందికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి, లక్ష్మీ నారాయణ కానిస్టేబుల్ బోస్‌తో సెల్ఫీ తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గుంతలో పడి చనిపోయిన మామ.. అల్లుడు ఏం చేశాడంటే?