ఆ రోడ్డు పై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారి అవాక్కయ్యారు. చూపు పక్కకు తిప్పకుండా దగ్గరకు వెళ్లి చూస్తే కళ్లేదుట కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. ఇంకేముంది నోట్లు తీసుకునేందుకు అక్కడ ఉన్న జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళంలో, నాగావళి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా కొత్త వంతెన వద్ద శుక్రవారం కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కరెన్సీ నోట్లు రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఒక్కసారిగా అంత డబ్బు రోడ్డుపై చూసిన జనాలకు మతి పోయింది.. తర్వాత ఆ డబ్బును తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హాస్పిటల్ కి, ఆఫీసులకు, కూలి పనులకు వెళ్ళేవారు ఇబ్బందులు పడ్డారు.
ఈ విషయం తెలుసుకొని ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే, ట్విస్ట్ ఏంటేంటే అవి నకిలీ నోట్లు అని తెలియడంతో అందరూ నిరాశకు లోనయ్యారు. వీటికోసమా తమ టైమ్ అంతా వేస్ట్ చేసుకొని ఎగబడి మరీ తీసుకున్నాం అంటూ నవ్వుకున్నారు. దీంతో అందరూ ఆ నోట్లను అక్కడే వదిలివేసి వెళ్లిపోయారు. ఈ వార్త నగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.