సాధారణంగా రోడ్డు ప్రమాదం అనగానే.. ఎవరైనా భయపడతారు. కొన్నిసార్లు ఆ దృశ్యాలను కూడా చూసేందుకు ఇష్టపడరు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ప్రమాదాలు ఆశ్చర్యపరుస్తాయి. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అని పదే పదే ఆ విజువల్స్ చూసేలా చేస్తాయి. అలాంటి ఒక ప్రమాదం గురించి ఇప్పుడు చూద్దాం.
ఆ రోడ్డు పై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారి అవాక్కయ్యారు. చూపు పక్కకు తిప్పకుండా దగ్గరకు వెళ్లి చూస్తే కళ్లేదుట కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. ఇంకేముంది నోట్లు తీసుకునేందుకు అక్కడ ఉన్న జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళంలో, నాగావళి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా కొత్త వంతెన వద్ద శుక్రవారం కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కరెన్సీ నోట్లు రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఒక్కసారిగా అంత డబ్బు రోడ్డుపై చూసిన […]