నేటికాలంలో జరుగుతున్న ఎక్కువ నేరాలకు కారణం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు. ఈ రెండు కారణాలతోనే ఎక్కువ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. భూ వివాదం కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.
నేటికాలంలో జరుగుతున్న ఎక్కువ నేరాలకు కారణం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు. ఈ రెండు కారణాలతోనే ఎక్కువ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. భూ వివాదం కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల ఇరువర్గాల మధ్య దాడులు జరిగిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో ఓ భూ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రత్యర్ధులపై పెప్పర్ స్ప్రే చల్లి.. కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం..
అనకాపల్లి జిల్లా గవరవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని జి.జగన్నాథపురం గ్రామానికి వెళ్లే రహదారిలో సర్పంచి చప్పగడ్డి మాణిక్యం కుమార్తె జొన్నపల్లి చిన్నతల్లికి సుమారు 45సెంట్ల స్థలం ఉంది. అయితే ఆ స్థలంలోకి ఏఆర్ కానిస్టేబుల్ వంకల అప్పలనాయుడు చొచ్చుకొని వచ్చి కంచే వేశారని చిన్నతల్లి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో ఎమ్మార్వో తిరుమల బాబు, వీఆర్వో రమణమూర్తి, సిబ్బంది వివాదంలో ఉన్న భూమి వద్దకు వెళ్లారు. అలానే ఇరువర్గాలను పిలిపించి విచారణ చేశారు. అయితే రెవెన్యూ సిబ్బంది భూమి వివరాలు అడుగుతున్న సమయంలో ఇరువర్గల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తన వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రేను ప్రత్యర్ధులపై కానిస్టేబుల్ చల్లాడు.
అనంతరం చేతిలో ఉన్న చిన్నపాటి కత్తితో దొరికిన వారినల్లా గాయపర్చి.. హల్ చల్ చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య పెద్ద కొట్లాట చోటుచేసుకుంది. ఇరువర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు 17 మందిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. దేయుడు నాయుడు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ వంకల అప్పలనాయుడు, ఉప్పల అప్పారావు, లక్ష్మణ్, నాగరాజు తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
అలానే వంకల అప్పల నాయుడు ఫిర్యాదు మేరకు , అర్జున్, చప్పగడ్డ అప్పల నాయుడు, దేముళ్ల నాయుడు, వెంకట రమణ, మజ్జి రమణ, అప్పల స్వామిలపై కేసు నమోదు చేశారు. ఈ భూ వివాదల కారణంగా పగలు, ప్రతీకారాలు పెరిగి పోతున్నాయి. చివరకు ఈ భూసమస్యల కారణంగా ఎందరో బలైపోతున్నారు. మరి.. ఇలాంటి ఘటనలకు జరగకుండా నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.