నిరుద్యోగులకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలలో జరుగుతోన్న నాడు – నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుమారు 10 వేలకు పైగా అంగన్వాడీల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. మిగిలిన సుమారు 45 వేల అంగన్‌వాడీలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని సీఎం జగన్ అధికారులకు తెలియజేశారు. అంగన్‌వాడీ సెంటర్లలో ఏయే సదుపాయాలు ఉన్నాయి? కల్పించాల్సినవి ఏంటి? అన్న దానిపై గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం తెప్పించుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలన్నారు. సంపూర్ణ పోషణ పథకం కింద పంపిణీ ప్రక్రియకు సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలని అధికారులకు తెలియజేశారు. పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో.. అంతే సమర్థవంతంగా సంపూర్ణ పోషణ పంపిణీ కూడాచేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీచేస్తూ.. అక్కడి పరిస్థితులు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అంగన్‌వాడీలలో సూపర్‌వైజర్లపై కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.