YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయుల లిస్టును ప్రకటించింది. ఇక, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించునున్నారు. సెప్టెంబర్ 5న విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది, ఇంటర్మీడియేట్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది, భాషా మరియు సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు ఉన్నారు. వీరితో పాటు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఐదుగురు సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందుకోనున్నారు.
176 మంది ఉత్తమ ఉపాధ్యాయుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి : భర్త దానికి ఒప్పుకోలేదని భార్య ఆత్మహత్య!