మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50)సోమవారం (ఫిబ్రవరి 21) ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకార్తలు స్వర్గీయ గౌతమ్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఈ క్రమంలో గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని సీఎం జగన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి వైఎస్సార్ మరణించిన తర్వాత.. పార్టీ పెట్టి.. ఒంటరిగా పోరాటం చేస్తున్న సమయంలో గౌతమ్ రెడ్డి తనకు మద్దతుగా నిలిచారు. రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా.. తన వెంటే నడిచారు. ఇవన్ని గుర్తు చేసుకున్న సీఎం జగన్ లోపల నుంచి తన్నుకొస్తున్న దుఖాన్ని అతి బలవంతం మీద కంట్రోల్ చేసుకున్నారు. చిన్నపాటి నుంచి గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పదే పదే భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి గౌతమ్‌రెడ్డిని చివరిసారి చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సమయంలో గౌతమ్‌రెడ్డిని చూసి ఆయన తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ pic.twitter.com/xYP3ERBy1n
— YSR Congress Party (@YSRCParty) February 23, 2022