పంజాబ్ లో ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలు ఓ ఫ్లైఓవర్ పై నిలిచి పోయారు అనే విషయం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై రాజకీయ నాయకులు మొదలు, సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తూ వచ్చారు. పంజాబ్ ప్రభుత్వ వైఫల్యం అంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే అంశంపై ఓ కమిటీని కూడా నియమిచారు. అదే అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా స్పందించారు.
Security breach in PM Narendra Modi’s convoy near Punjab’s Hussainiwala in Ferozepur district. The PM’s convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
— ANI (@ANI) January 5, 2022
ప్రధాని మోదీ భద్రత విషయంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదే అంశంపై చంద్రబాబు నాయుడు తన అధికార ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. ‘ఇటీవల పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యం చాలా ఆందోళన కలిగిస్తోంది. దేశ ప్రధాని భద్రత అంటే జాతీయ భద్రతగా భావించాలి’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
The recent security breach during @narendramodi Ji’s visit to Punjab is deeply concerning. Prime Minister’s security is nation’s concern.
— N Chandrababu Naidu (@ncbn) January 8, 2022
అసలు ఏం జరిగిందంటే: ప్రధాని మోదీ హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మరకాన్ని సందర్శించేందుకు భఠిండా చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్మారకం వద్దకు హెలికాప్టర్ వెళ్లాలి. కానీ, అక్కడ వాతావరణం అనుకూలించలేదు. కాసేపు భఠిండాలోనే వేచి ఉన్నారు. అప్పటికీ వాతావరణంలో మార్పు లేకపోవండతో రోడ్డు మార్గాన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు మార్గంలో భఠిండా నుంచి హుస్సేనీవాలాకు వెళ్లేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆ విషయాన్ని పంజాబ్ డీజీపీకి ముందుగానే సమాచారమిచ్చారు. రోడ్డు మార్గంలో భద్రతా ఏర్పాట్ల ధ్రువీకరణ తర్వాత మోదీ బయల్దేరారు.
మోదీ ఓ ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి కొందరు ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేశారు. పైవంతెనపై ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. చేసేది లేక మోదీ జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించుకోవాల్సిన పర్యటనను రద్దు చేసుకుని భఠిండా విమానాశ్రయానికి తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.