ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. నేతల పర్యటనల్లో, ప్రచారాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లకు ఇప్పటి నుంచి నేతలు హడావుడి మొదలు పెట్టారు. ప్రచారాలు, భారీ బహిరంగ సభలు, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ నేతలు తాము చేసిన అభివృద్ది పనుల గురించి చెబుతుంటే.. రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒరిగింది ఏమీ లేదని.. ప్రజలను అధికార ప్రభుత్వం దారుణంగా మోసం చేశారని.. ఆర్థిక వ్యవస్థను కృంగదీశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు విజయనగరంలో పర్యటిస్తున్న సమయంలో ఓ టీ స్టాల్ నడుపుతున్న కుటుంబాన్ని సంతోషపట్టారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రటీలు, రాజకీయ నేతలు ఏది చేసిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఓటర్లను పొగడ్తలతో ముంచెత్తి ఆకర్షితులను చేస్తుంటారు. అలాగే చంద్రబాబు కూడా ప్రచారంలో భాగంగా ఇలా చేయడం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా విజయనగరంలో పర్యటన ముగించుకొని అనకాపల్లి వెళ్తూ.. ఆ దారిలో రోడ్డు పక్కగా టీ కొట్టు దగ్గరకు వెళ్లాడు.అక్కడ ఒక టీ తాగి, హోటల్ నిర్వహిస్తున్న శివమ్మను, ఆమె కుమార్తెను పలకరించారు. ఆమె కూతురు యశస్వి చదువు గురించి ఆరా తీశారు.
తనకు ఇంటి స్థలం మంజూరు కాలేదని శివమ్మ ఆవేదనతో తన కుటుంబ ఆర్థికపరిస్థితిని గురించి తెలిపింది. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత శివమ్మకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఇంటర్మీడియేట్ చదువుతున్న యశస్వికి ప్రోత్సాహకంగా రూ.10 వేలు ఇచ్చారు. దీంతో శివమ్మ కుటుంబం హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రోత్సాహకంగా ఇచ్చిన రూ.10 వేల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.