ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో.. ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురైనారు. ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు ఎండల తీవ్రతకు వాతావరణంలో వేడి తీవ్రతకు చాలాచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అనేక దుకాణాలలో, ఇళ్లలో కూడ అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోయారు. ఊహించని అగ్నిప్రమాదాల వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. దీనితో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో.. ఓ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురైనారు. ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేయడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ‘అభి’ షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడి ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలముకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని..మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. షాపింగ్ మాల్లోని వస్త్రాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. రూ. 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఘటన జరిగినట్లు సమాచారం అందింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.